![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -424 లో.. నీకు భర్త అంటే ఇష్టం లేదు.. భార్య స్థానం ఇష్టం లేదు.. కేవలం నువ్వు ఆస్తి కోసమే ఇదంతా అని కావ్యని అపర్ణ తిడుతుంది. అప్పుడే ఇందిరాదేవి వచ్చి.. బాగా చెప్పావని అపర్ణ ని అంటుంది. ఇందిరాదేవి వచ్చి కావ్య చెంపచెల్లుమనిపిస్తుంది. ఆ సంతకం చేసి ఏం సాధించావు, ఎవరికోసం ఈ త్యాగం చేసావని కావ్యని తిడుతుంది. అన్ని తెలుసనుకున్నా కానీ నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకునే పిచ్చిదానివి అనుకోలేదని ఇందిరాదేవి అంటుంది.
కావ్య సంతకం చేస్తుంటే ఎవరు ఆపలేదని అందరిని ఇందిరాదేవి తిడుతుంది. అపర్ణ మాట్లాడుతుంటే నీతో మాట్లాడాలంటేనే కంపరంగా ఉందని ఇందిరాదేవి ఆపుతుంది. ఆ తర్వాత కావ్య ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటే అప్పుడే కళ్యాణ్ వస్తాడు. మీ కాపురాన్ని ముక్కలు చేసుకోవడంలో మీరు సక్సెస్ అయ్యారు కదా అని.. నా అంచనాలు మించి మీ తెలివితేటలు ఉన్నాయంటూ కోపంగా కళ్యాణ్ మాట్లాడతాడు. "ఈ ఇంట్లో ఉండి ఏం సాధించారు.. కనీసం మా అన్నయ్య భార్యగా ఉండే హక్కు కోల్పోతున్నారు.. మీరు వంటింటికే పరిమితమవుతారు. మీకు ఒక మనసు ఉంటుంది కదా.. మీకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా.. భర్తకి భార్య ప్రేమని పంచాలి కానీ భర్తనే పంచకూడదు.. మీకు అర్థం అవుతుందా" అని కళ్యాణ్ అనగానే.. అర్ధమవుతుంది నా భవిష్యత్తు గురించి ఆలోచించే వారిలో మీరు ముందుంటారు. మీరే నా జీవితం గురించి అంతలా ఆలోచిస్తుంటే నేనేంత ఆలోచిస్తానని కావ్య అంటుంది.
మరొకవైపు నువ్వు అనుకున్నది సాధించావంటూ రుద్రాణితో రాహుల్ అంటాడు. నాకే భయంగా ఉంది.. అబద్ధం ఆడి పెళ్లి చేసుకుంటున్నానని మాయ అనగానే నేను చెప్పినట్టు విన్నంత వరకు ఏం కాదని మాయతో రుద్రాణి అంటుంది. మరొకవైపు రాజ్ సుభాష్ ఇద్దరు ఎందుకిలా చేసావంటూ కావ్యని అడుగుతారు. టైమ్ వుంది కదా ఈ పెళ్లి జరగనివ్వనని కావ్య అనగానే.. నీపై నాకు నమ్మకం ఉందని సుభాష్ అనగానే.. నాకు లేదని రాజ్ అంటాడు. మరొకవైపు అప్పు అసలైన మాయని వెతకడానికి వెళ్తుంది. మాయ అడ్రస్ దొరుకుతుంది.. తరువాయి భాగంలో మాయ వాళ్ళింటికి అప్పు వెళ్తుంది. ఆ విషయం కావ్యకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |